![]() |
![]() |
ఇక ఇష్మార్ట్ జోడి సీజన్ 3 లో లాస్ట్ వీక్ వెడ్డింగ్ థీమ్ ఇచ్చాడు. ఇక ఈ వారం స్కూల్ థీమ్ తో జోడీస్ రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజయింది. ఇక ఇందులో కంటెస్టెంట్స్ అంతా కూడా స్కూల్ డ్రెస్సుల్లో వచ్చారు. ఇక ఇప్పుడు నామినేషన్స్ ని స్టార్ట్ చేసాడు హోస్ట్ ఓంకార్. ఐతే ఆదిరెడ్డి - కవితను స్టేజి మీద నిలబెట్టారు. వాళ్ళ మీద రెడ్ ఇన్క్ ని జల్లారు జోర్దార్ సుజాత - రాకేష్ జోడి అలాగే అనిల్ గీలా - ఆమని జోడి. వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే "కవిత ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి గేమ్స్ లో ఇబ్బంది అవుతుందేమో అని" ఆ రెండు జోడీలు చెప్పాయి. దాంతో ఆదిరెడ్డి ఇలా అన్నాడు "కన్సీవ్ అని చెప్పి నామినేట్ చేస్తే కవిత ఒప్పుకోదు. అది కరెక్ట్ రీజన్ కాదు అని నా ఉద్దేశం. కన్సీవ్, కడుపు అని చెప్పడం కరెక్ట్ కాదు. కడుపు వచ్చిన తర్వాత కూడా ఆడతానని ధైర్యంగా వచ్చినప్పుడు కవితను మెచ్చుకోవాలి కానీ నామినేషన్ ని రీజన్ గా చెప్పడం కరెక్ట్ కాదు" అని అన్నాడు ఆదిరెడ్డి. ఇక ఈ ఎపిసోడ్ లోకి సెక్సీ బాంబు చొక్కారపు స్రవంతి స్కూల్ స్టూడెంట్స్ డాన్స్ నేర్పే టీచర్ గా తీసుకొచ్చాడు ఓంకార్. "మా ఇంటి ముందుంది పెట్రోల్ బ్యాంకు...ఓంకార్ గారు హ్యాండ్ సం హన్కు" అంటూ తెగ ఫ్లర్ట్ చేసేసింది. ఇక ఆయన్ని ఒక గులాబీతో ఆయన్ని గిలిగింతలు పెట్టింది. కాసేపు స్టూడెంట్స్ తో కలిసి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది.
![]() |
![]() |